నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. మరి.. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేదా ప్రజల కోసమే బతుకుతున్నామనే కమ్యూనిస్టులు ఎందుకు యువతను ఆకర్షించలేక పోతున్నారు? వారు జెన్ జీ భాషను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? లేక ఉద్యమాలకు కదిలే నైజం యువతలో నశించిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారా? వారి పిలుపులకు స్పందించని విద్యార్థులు.. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో ఎందుకు పోటెత్తారు?
విధాత ప్రత్యేకం
శ్రీశైలం వెళ్లాలంటే ప్రస్తుతం ఘాట్ రోడ్డు ఒకటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. నల్లమల అరణ్యంలో నుంచి వెళుతున్న కారణంగా.. ఆ రోడ్డుపై రాత్రిళ్లు ప్రయాణాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలను కలుపుతూ శ్రీశైలం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ.. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే చర్చలు సాగుతున్నది.
విధాత ప్రత్యేకం
ఆపరేషన్ కగార్ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతల రాజకీయ భవిష్యత్తేంటనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సీపీఐ నాయకత్వాన్ని పలువురు మావోయిస్టు మాజీ నేతలు కలువడంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకున్నది. లొంగుబాట్లకు ముందే భిన్నాభిప్రాయాలతో ఉన్న నాయకులు.. ఇప్పుడు అంతా కలిసి మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటారా? లేక వ్యక్తులుగా తమ తమ అంచనాల మేరకు వివిధ రాజకీయ పార్టీల్లో చేరతారా? అనేది తేలాల్సి ఉంది.
విధాత ప్రత్యేకం
తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.
విధాత ప్రత్యేకం