Group-3 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్.. ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం

Group-3 గ్రూప్-3 రాత‌ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో గ్రూప్-3 అభ్య‌ర్థులకు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌వ‌ర‌ణ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చని టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్ర‌క‌టించారు. మొత్తం 1388 గ్రూప్-3 పోస్టుల‌కు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న‌ట్లు […]

  • By: krs    latest    Aug 14, 2023 1:25 PM IST
Group-3 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్.. ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం

Group-3

గ్రూప్-3 రాత‌ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో గ్రూప్-3 అభ్య‌ర్థులకు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌వ‌ర‌ణ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది.

ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చని టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్ర‌క‌టించారు.

మొత్తం 1388 గ్రూప్-3 పోస్టుల‌కు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్‌-3 కేటగిరీలో 1,375 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 30న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

గ్రూప్‌-3లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జతచేస్తూ ఈ ఏడాది జూన్ నెల‌లో టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం.. ఇరిగేషన్‌ విభాగం, ఐ అండ్‌ కాడ్‌లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జత చేస్తున్నట్టు తెలిపింది.

కొత్తగా కలిపిన ఉద్యోగాలతో కలిపితే మొత్తం గ్రూప్‌-3 ఉద్యోగాల సంఖ్యం 1388కి పెరిగింది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ సూచించారు.