Site icon vidhaatha

YS Sharmila | షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

YS Sharmila

విధాత: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిలను కాంగెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతు షర్మిలకు కాంగ్రెస్‌లోకి ఎప్పుడు ఆహ్వానం ఉంటుందన్నారు. ఆమె కాంగ్రెస్‌లోకి రావాలని తాను కోరుతున్నానన్నారు.

షర్మిలను పార్టీలో కలుపుకు పోవాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వంపై ఉందన్నారు. వైఎస్సార్ పాలనలో సంక్షేమ పథకాలు అందిన పేదలంతా షర్మిలను కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎక్కడైనా పనిచేయవచ్చని, తెలంగాణ పార్టీగా చెప్పుకునే సీఎం కేసీఆర్ తన బీఆరెస్‌ను జాతీయ పార్టీగా చేసి మహారాష్ట్రలో రాజకీయం చేయడం లేదా అని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాలుగు ఓట్లు వచ్చినా, నాలుగు వందల ఓట్లు వచ్చినా అందరిని కలుపుకు పోవాల్సిన బాధ్యత పార్టీదేనన్నారు. కాగా షర్మిల,భర్త అనిల్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నాయకులను కలిసి తన వైఎస్సార్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపైన, తన రాజకీయ భవిష్యత్తుపైన చర్చలు జరిపారు. రాత్రి ఆమె తిరిగి హైద్రాబాద్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా షర్మిల విమానాశ్రయం వద్ధ మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో తన చర్చలు సంతృప్తికరంగా సాగాయని, చర్చలు వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు.

Exit mobile version