Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

వరుస వివాదాల్లో మినిస్టర్‌ పొన్నం ప్రభాకర్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు . మొన్న మంత్రి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు నేడు వేమూరి కావేరి ట్రావెల్స్ తో బద్నాం .. చెక్ పోస్టుల ఎత్తవేతలోనూ నిర్లక్ష్యం ...పాపారావు వీఆర్ఎస్ లోనూ పాత్ర తో మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత బద్నాం అయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు.

మామూళ్ల మత్తులో ఆర్టీఏ.. రాజ్యమేలుతున్న ట్రావెల్స్ మాఫియా!

ప్రతినెలా సంబంధిత పోలీసు స్టేషన్ కు మామూళ్లు అందుతాయని, నగరంలో ఎంపిక చేసిన పోలీసు స్టేషన్లకు ప్రతి నెలా ట్రావెల్స్ యజమానులు డబ్బులు ముట్టచెబుతారని తెలుస్తున్నది. ఈ కారణంగానే ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఈగ కూడా వాలడం లేదని అంటున్నారు. ఇప్పుడు ఇంతటి ఘోర దుర్ఘటన తర్వాతనైనా రవాణా శాఖ అధికారులు కళ్లు తెరుస్తారా? లేదా తాత్కలికంగా కళ్లు తెరిచి.. రెండు మూడు రోజులు హడావుడి చేసి.. మళ్లీ అదే మామూళ్ల మత్తులో జోగుతూ పడుకుంటారా? కాలమే తేల్చాలి.

స్లోమోషన్‌లో పాము కాటు వీడియోలు.. చూస్తే గుండెలు గుభేలే!

పాము కాటు వీడియోలు చూసి ఉంటారు కానీ.. సెకనుకు వెయ్యి ఫ్రేములతో చిత్రీకరించిన పాము కాటు వీడియోలను ఎప్పుడైనా చూశారా? పాము కాట్లపై అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు.

భూమికి మరో చందమామ? నాసా ఏం ధృవీకరిస్తున్నది?

భూమికి మరో చందమామ ఉన్నదా? అవుననే అంటున్నది నాసా.. మనకు తెలియకుండానే 60 ఏళ్లుగా భూమి చుట్టూ తిరుగుతున్న ఈ అర్ధ చంద్రుడు.. 2083 వరకూ తిరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

సింహం సహనానికి తాబేలు పరీక్ష

దప్పికతో నీళ్లు తాగుతున్న సింహం సహనానికి ఒక బుల్లి తాబేలు పరీక్ష పెట్టిన వీడియో వైరల్ అయింది. నీటి మడుగు వద్ద సింహం ముఖానికి అడ్డు పడుతూ తాబేలు చికాకు పెట్టినా, సింహం కోపం తెచ్చుకోకుండా శాంతంగా నీరు తాగి వెళ్లిపోయింది. సింహం సంయమనం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Tortoise Stops Lion From Drinking Water

సీట్ల‌లో ఆ అస్థిపంజ‌రాల‌ను చూసి చ‌లించిపోయా.. ప్ర‌త్య‌క్ష సాక్షి హైమారెడ్డి

V Kaveri Travels | వి కావేరి ట్రావెల్స్ బ‌స్సు( V Kaveri Travels Bus ) ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌త్య‌క్ష సాక్షి హైమా రెడ్డి( Hyma Reddy ) తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. క్ష‌ణాల్లోనే బ‌స్సు కాలి బూడిదైంది. సీట్ల‌లో ఆ అస్థిపంజ‌రాల‌ను చూసి చ‌లించిపోయాను అని హైమా రెడ్డి క‌న్నీరు పెట్టుకున్నారు.

ధరణి వెళ్లి భూ భారతి పోర్టల్ వచ్చినా కష్టాలు తప్పడం లేదా?

రైతులకు అన్యాయం చేసిన ధరణిని బంగాళాఖాతంలో పడేసి.. న్యాయం చేసే విధంగా భూభారతి చట్టాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఊదరగొడుతున్నా.. భూభారతిలోనూ సమస్యలు అలానే పడి ఉంటున్నాయని, పైగా కమీషన్లతోనే పనులు అవుతున్నాయని రైతులు, బిల్డర్లు వాపోతున్నారు.