బ్యాంకుల్లో లోన్ రూ.3 కోట్లు దాటితే సీబీఐ విచారణ
విధాత: బ్యాంకుల్లో నకిలీ ధ్రువపత్రాలు పెట్టి రూ.3 కోట్లకుపైగా అప్పు తీసుకుంటే సీబీఐ విచారణకు వెళ్లాలని ఎస్‌బీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అంతకంటే తక్కువుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగా నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో 2018 కంటే ముందు అప్పు తీసుకొని బకాయి ఉన్నవారి వివరాలను సేకరించారు. వారు సమర్పించిన పత్రాలు అసలువా లేక నకిలీవా.. అని తెలుసు కోవడానికి బ్యాంకర్లు […]

విధాత: బ్యాంకుల్లో నకిలీ ధ్రువపత్రాలు పెట్టి రూ.3 కోట్లకుపైగా అప్పు తీసుకుంటే సీబీఐ విచారణకు వెళ్లాలని ఎస్‌బీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అంతకంటే తక్కువుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగా నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో 2018 కంటే ముందు అప్పు తీసుకొని బకాయి ఉన్నవారి వివరాలను సేకరించారు. వారు సమర్పించిన పత్రాలు అసలువా లేక నకిలీవా.. అని తెలుసు కోవడానికి బ్యాంకర్లు మండలాల వారీగా తహసీల్దార్లకు లేఖలు రాయగా వారు పరిశీలిస్తున్నారు. ఊట్కూరు ఎస్‌బీఐ ద్వారానే 300 మందికి సంబంధించిన ధ్రువపత్రాలను ఎమ్మార్వోలకు అందించారు. మిగతా మండలాల్లోనూ వీటిపై లోతుగా అధ్యయనం చేయడానికి బ్యాంకర్లు రెవెన్యూ శాఖ సాయం తీసుకుంటున్నారు.
నకిలీ పాసుపుస్తకాలు, ఫోర్జరీ సంతకాల ముఠాపై కలెక్టర్ హరిచందన ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు తెలపాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ అధికారులు నకిలీ ధ్రువపత్రాల ముఠాపై విచారణ చేపడుతున్నారు. ఈ కుంభకోణంలో రూ.3 కోట్ల మేర అవకతవకలు జరిగితే మాత్రం సీబీఐ విచారణ చేపట్టే అవకాశాలుండడంతో అక్రమార్కుల వెన్నులో వనుకు మొదలైంది.