Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ప్రళయ సౌందర్యం : తుపాను ‘కంట్లో’కి దూసుకెళ్లిన విమానం

ఈ ఏటి పెను తుపాను మెలిస్సా కంట్లోకి ప్రవేశించి రికార్డు నెలకొల్పిన అమెరికా వాయుసేన. హరికేన్​ హంటర్స్​గా పేరొందిన వీరు చిత్రీకరించిన అద్భుత దృశ్యాలను చూసిన ప్రపంచం మైమరచిపోయింది. ప్రళయంలో కూడా సౌందర్యాన్ని చూపించిన వీరి సాహసానికి లోకం జేజేలు పలికింది. కానీ, ఆ తుపాను సృష్టించిన బీభత్సానికి జమైకా దీవి భారీ నష్టాన్ని చవిచూసింది.

US Air Force ‘Hurricane Hunters’ Fly Into The Eye Of Category 5 Hurricane Melissa

'బొట్టు బిళ్ల‌ల'తో రూ. 20 ల‌క్ష‌ల సంపాద‌న‌.. హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన మేఘ‌న స‌క్సెస్ స్టోరీ ఇది

Meghana Khanna Bindi | హిందూ సంప్ర‌దాయం( Hindu Custom )లో బొట్టు( Bindi )కు ప్ర‌త్యేక స్థానం ఉంది. కుంకుమ‌ను బొట్టుగా పెట్టుకోవ‌డం ఆనాదిగా వ‌స్తుంది. ఈ కుంకుమ స్థానంలో బొట్టు బిళ్ల‌లు( Bottu Billa ) వ‌చ్చేశాయి. కుంకుమ‌కు బ‌దులుగా చాలా మంది విభిన్న ర‌కాల‌తో కూడిన బొట్టు బిళ్ల‌ల‌ను ధ‌రించేవారు. కానీ ఫ్యాష‌న్ మాయ‌లో ప‌డిపోయిన నేటి మ‌హిళా లోకం.. ఆ బొట్టు బిళ్ల‌ల‌ను కూడా పెట్టుకోవ‌డం మానేశారు. ఇలాంటి వారి కోసం ఓ చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని వెతికింది హైద‌రాబాద్‌( Hyderabad )లో పుట్టి పెరిగిన మేఘ‌న ఖ‌న్నా( Meghana Khanna ).

ఆమె చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే.. సంపాద‌న మాత్రం రూ. 70 ల‌క్ష‌లు..!

Millet Food Business | ఆమె గొప్ప‌గా చ‌దువుకోలేదు. అంద‌రి మాదిరి ప‌దో త‌ర‌గ‌తి( Tenth Class ) వ‌ర‌కు చ‌దువుకుంది. కానీ ఆర్థికంగా ఎద‌గాల‌న్న ఆకాంక్ష ఆమెను బిజినెస్( Business ) వైపు మ‌ళ్లించింది. ఆవు పాల‌( Cow Milk )తో వ్యాపారం ప్రారంభించింది. కానీ ఆర్థికంగా స్థిర‌ప‌డ‌లేదు. సీన్ క‌ట్ చేస్తే రోస్టెడ్ సోయా న‌ట్స్( Roasted Soya Nuts ) అమ్మింది. అటు వైపు నుంచి మిల్లెట్ ఫుడ్( Millet Food Business ) వైపు అడుగులు వేసింది. ఈ రంగంలో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించి రూ. 70 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగింది. మ‌రి ఆమె గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానా( Haryana ) వెళ్లాల్సిందే.

తెలుగు యువకుడికి ₹240 కోట్ల జాక్​పాట్​.!

దుబాయ్‌లో నివసిస్తున్న తెలుగు యువకుడు **అనిల్‌కుమార్‌ బొల్లా (29)**కు అదృష్టం కలిసివచ్చింది. ఆయన యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్‌పాట్‌ ₹240 కోట్లు (AED 100 మిలియన్) గెలుచుకున్నారు. తల్లి పుట్టిన రోజైన “11” సంఖ్యను లాటరీ నంబర్‌గా ఎంచుకోవడం ఆయనకు అద్భుత అదృష్టాన్ని తీసుకొచ్చింది. దీపావళికి ముందు ఈ గెలుపు ఆయన జీవితంలో ముందుగానే కళ్లుమిరుమిట్లు గొలిపే కాంతిని విరజిమ్మింది.

Telugu Man Wins ₹240 Crore UAE Lottery — Mother’s Birthday Number Turns Into Record-Breaking Luck

కాంగ్రెస్‌ సర్కార్‌లో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వరా? అధికారులేమంటున్నారు?

దాదాపు ఆరునెలలుగా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు (Pattadar passbook) రాకపోవడంపై తెలంగాణ రైతులు (Farmers in Telangana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్‌ రిజిస్ట్రేషన్స్‌ (land registrations) పూర్తి అయిన తర్వత కూడా తమకు యాజమాన్య హక్కు పత్రాలు (ownership documents) అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అది సీసీఎల్‌ఏ (CCLA office) బాధ్యతని చేతులెత్తేస్తున్నారు.

Drunk man offers liquor to tiger

ఓర్నీ....తాగితే పులి కూడా పిల్లియేనా..! నిజమా? ఏఐ కల్పనా?

మధ్యప్రదేశ్‌లో రాజు పటేల్ అనే కూలీ మద్యం మత్తులో ఎదురైన పులిని పిల్లి అనుకుని, దానికి లిక్కర్ తాగమని బతిమాలాడాడు. పెంచ్ నేషనల్ పార్క్ సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డై వైరల్‌గా మారింది. పులి అతనికి ఎటువంటి హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. ఇది ఏఐ క్రియేషన్ అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.