Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

మావోయిస్టు పార్టీ మాజీ అగ్ర‌నేత మ‌ల్లోజుల వీడియో రిలీజ్

మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆపరేషన్ కగార్ అనంతర పరిణామాలు..తన లొంగుబాటుకు దారితీసిన పరిస్థితులు, పార్టీలో తలెత్తిన పరిణామాలు వంటి వాటిపై వివరణాత్మకంగా వివరించారు

మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్ధుల గల్లంతు

ఏపీ నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల కోసం రెస్క్యూ బృందాలు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

భారత్ ఏను గెలిపించిన రిషబ్ పంత్

బెంగుళూరు వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ జట్టు 3వికెట్లతో విజయం సాధించింది. రిషబ్ పంత్ భారత్ ఏను తన అధ్బుత పోరాట పటిమతో కూడిన బ్యాటింగ్ తో గెలిపించి మరో సారి తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు.

ఈ పక్కనే మన జనతా గ్యారేజ్..ఒక్క ఫోన్ కొట్డండి: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఓటర్లపై కాంగ్రెస్ గుండాలు, రౌడీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..ఎవరైనా బెదిరిస్తే ఈ పక్కనే ఉన్న జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ కు ఫోన్ కొట్టాలని..40 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకొని వస్తా.. ఎవడేం చేస్తడో చూస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు

షారూక్ ఖాన్ ‘కింగ్‌’ గ్లింప్స్ విడుదల

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ ఖాన్‌ హీరోగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న కింగ్ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ టైటిల్‌ని ఆదివారం ప్రకటిస్తూ గింప్స్ ను విడుదల చేశారు. ఈ యాక్షన్ మూవీ పేరు ‘కింగ్‌’ గా మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్‌’ 2026లో రిలీజ్‌ కానుంది.

టామ్ కాదు సింహం.. వేటలో జారిపడింది పాపం!

అడవిలో వేట అంటే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక జంతువు తన ఆకలిని తీర్చుకోవడానికి ఆహారం కోసం వేటాడుతుంటే.. మరో జీవి తన జీవితం, ప్రాణం కోసం తప్పించుకోవాలని పోరాడుతుంది.