Trisha Krishnan | త్రిష క్రిష్ణన్ పరిచయం అక్కర్లేని పేరు. టీనేజ్‌లోని మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్’ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో పలువురు సినీ నిర్మాతల దృష్టిలో పడ్డ త్రిష ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసింది. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నది. తండ్రి లేకపోయినా.. తల్లి ప్రోత్సాహంతో సినీరంగంలోకి వచ్చింది. మొదట ‘జోడీ’ చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. […]

Trisha Krishnan | త్రిష క్రిష్ణన్ పరిచయం అక్కర్లేని పేరు. టీనేజ్‌లోని మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్’ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో పలువురు సినీ నిర్మాతల దృష్టిలో పడ్డ త్రిష ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసింది. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నది. తండ్రి లేకపోయినా.. తల్లి ప్రోత్సాహంతో సినీరంగంలోకి వచ్చింది.
మొదట ‘జోడీ’ చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సూర్య హీరోగా తెరకెక్కిన ‘మౌనం పెసియాదే’లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘నీ మనసు నాకు తెలుసు’ ద్విభాషా చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘వర్షం’తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటించి.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం 40 ఏళ్ల త్రిష త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నది.
వాస్తవానికి గతంలో తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది. నిశ్చితార్థం సైతం అంగరంగ వైభవంగా జరిగింది. ఎందుకోగాని పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత త్రిషపై వరుణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులు సినిమాలకు దూరమైన త్రిష ఇటీవల మళ్లీ కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో నటించగా.. ప్రస్తుతం విజయ్‌తో ‘లియో’లో చేస్తున్నది.
అలాగే ‘ది రోడ్’, ‘విడా ముయార్చి’, ‘సత్తురంగా వెట్టై 2’ తదితర తమిళన చిత్రాల్లో నటిస్తున్నది. అలాగే ‘రామ్ పార్ట్-’, ‘ఐడెంటిటీ’ అనే మలయాళ సినిమాల్లో నటిస్తున్నది. అయితే, ఇప్పటికే త్రిషతో కెరీర్‌ను ప్రారంభించిన హీరోయిన్లు అంతా పెళ్లి చేసుకొని స్థిరపడగా.. త్రిష మాత్రం వాయిదా వేస్తూ వచ్చింది. పలు ఇంటర్వ్యూ పెళ్లి గురించి ప్రస్తావించిన సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఓ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను త్రిష మనువాడబోతున్నట్లు సమాచారం. వీరిద్దరు చాలా రోజుల కింద ఓ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిరుగురించిందని, ప్రస్తుతం పెళ్లి వరకు వెళ్లబోతున్నట్లు టాక్, ఎంగేజ్‌మెంట్ సైతం జరుగుతుందని.. ఈ ఏడాదిలోనే పెళ్లి జరుగుతుందని ప్రచారం జరుగుతున్నది. ఇందులో ఎంత వాస్తవమనేది తెలియాల్సి ఉంది.
