Site icon vidhaatha

Anushka Shetty | పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్‌ జేజమ్మ.. వ్యాపారవేత్తతో అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్‌..!

Anushka Shetty | చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లపై గాసిప్స్‌ సాధారణంగానే ఎక్కువగా వస్తుంటాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ గాసిప్స్‌ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా డేటింగ్‌, పెళ్లిళ్లు, విడాకులంటూ సినీతారలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయి. ఇక స్టార్స్‌ విషయంలో ఇంకాస్త ఎక్కువగానే వస్తాయి. చిత్ర పరిశ్రమ అనేది ఓ కలల ప్రపంచం. చాలామంది కెరీర్‌పైనే దృష్టి సారిస్తుంటారు. వయసు పెరుగుతున్నా పెళ్లి ప్రస్తావన తీసుకురారు. అయినా, సార్ట్‌ హీరోయిన్ల విషయంలో ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త వైరల్‌ అవుతున్నది. బాహుబలి బ్యూటీ అనుష్క శెట్టి పెళ్లి వార్త మరో తెరపైకి వచ్చింది. సూపర్‌ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఆ తర్వతా అరుంధతి మూవీతో బ్లాక్‌బస్ట్‌ హిట్‌ని సొంతం చేసుకున్నది.

ఇక బాహుబలి మూవీతో పాన్‌ ఇండియా లెవల్‌లో ఫ్యాన్‌బేస్‌ పెరిగింది. బాహుబలి సిరీస్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తుందని అంతా భావించారు. బాహుబలి-2 తర్వాత భాగమతి, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో కనిపించింది. 2020లో వచ్చిన నిశ్శబ్దం మూవీ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. మళ్లీ 2023లో తెలుగులో మిస్సెస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో కనిపించింది. అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం సెలెక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటున్నది. ఈ క్రమంలోనే తొలిసారిగా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నది. కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ మూవీలో నటిస్తున్నది. ఇవన్నీ ఇలా ఉండగా.. తాజాగా పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో బాలీవుడ్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

అయితే, ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. తాము బెస్ట్‌ ఫ్రెండ్స్‌ని అని చెప్పుకొచ్చారు. అలాగే, ఓ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్‌ వచ్చాయి. ఇందులోనూ ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తేలిపోయింది. తాజాగా ఓ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లికి సిద్ధమైందని తెలుస్తున్నది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించినా.. అనుష్క ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని టాక్‌. అయితే, అనుష్క ఓకే చెబితే త్వరలోనే పెళ్లి కార్యక్రమం జరుగనున్నది ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం అనుష్క నాలుగు పదుల వయసు దాటింది. ఈ సారైనా ముదుగుమ్మ పెళ్లి చేసుకుంటుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, పెళ్లిపై గతంలో అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది. తనకు పెళ్లిపై నమ్మకముందని.. వివాహానికి తాను వ్యతిరేకం కాదని చెప్పింది. సమయం, వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ప్రస్తుతం అనుష్క పెళ్లి వార్తలు మరోసారి వైరల్‌గా మారాయి.

Exit mobile version