అమాయ‌క‌పు భ‌ర్త‌ని ఎందుకు చీట్ చేశావ్ అని స‌మంత‌ని మొహం మీదే అడిగిన నెటిజ‌న్

  • Publish Date - April 8, 2024 / 05:12 AM IST

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగు, త‌మిళం,హిందీ భాష‌ల‌కి సంబంధించిన ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించింది. స‌మంత కొద్ది రోజుల క్రితం మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డంతో సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చింది. త్వ‌ర‌లో తిరిగి సినిమాలు చేయాల‌ని అనుకుంటుంది. అయితే నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లిచేసుకున్న స‌మంత ఊహించ‌ని విధంగా అతనికి విడాకులు ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. మూడేళ్ల‌పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకున్నారో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. ఇప్ప‌టికీ కూడా వారి విడాకుల‌కి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది.

స‌మంత గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ఫోటోలు షేర్ చేస్తూ ఉండ‌డం, ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్‌గా స‌మంత త‌న ఆరోగ్యానికి సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. యోగ‌లో భాగంగా త‌ను రోజు చేసే మెడిటేష‌న్ టైమింగ్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుండ‌గా, దానికి నెటిజ‌న్స్ వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజ‌న్ మాత్రం మీ అమాయ‌క‌పు భ‌ర్త‌ని ఎందుకు మోసం చేశారు అని అడిగారు. దానికి స‌మంత ఊహించ‌ని స‌మాధానం ఇచ్చింది . ఈ ప్ర‌శ్న మీకు మంచిది కాక‌పోవ‌చ్చు. మీకు స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి, మీరు మంచిగా ఉండాల‌ని కోరుకుంటున్నా అని పేర్కొంది.

స‌మంత ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.ఇక స‌మంత మాయోసైటిస్ వచ్చిన తర్వాత ఫుల్ గా హెల్త్ మీద, ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల స‌మంత జిమ్ చేస్తున్న ఫొటోని పంచుకుంది. ఆ ఫోటోని చూసి వామ్మో సమంత ఈ రేంజ్ లో బాడీ పెంచుతుంది ఏంటి? ఫుల్ ఫిట్ గా తయారవ‌డానికి కార‌ణం ఏమైన ఉందా అని నెటిజ‌న్స్ కామెంట్ చేశారు. ఇక స‌మంత చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమి లేకపోయినా గతంలో ఆమె చేసిన సిటాడెల్ సిరీస్ త్వరలో అమెజాన్ లో రిలీజ్ కానుంది.

Latest News