Site icon vidhaatha

GAMA Awards : గామా బెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary

విధాత : తెలుగులో రూ.300కోట్లు కొల్లగొట్టిన బాక్సాఫీస్ హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam) మూవీతో క్రేజీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరికి(Meenakshi Chaudhary) ఆశించిన సినిమా ఛాన్స్ లు అందక రేసులో కాస్తా వెనుకపడింది. సీనియర్ హీరో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికి ఈ ముద్దుగుమ్మ చేతిలోప్రస్తుతం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) అనే సినిమా మాత్రమే ఉంది. అయితే మీనాక్షి చౌదరికి దుబాయ్‌లో జరిగే గామా (గల్ఫ్ అకాడెమీ మూవీ అవార్డ్స్) రూపంలో మరో గొప్ప విజయం దక్కింది. ఆదివారం (ఆగస్టు 31) రాత్రి జరిగిన గామా వేడుకలో టాలీవుడ్ నటులు తమ సత్తా చాటారు. గామా(GAMA) ఉత్తమ నటిగా మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్) అవార్డు అందుకున్నారు.

పుష్ప 2(Pushpa 2) మూవీ అన్ని ప్రధాన అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప2 ది రూల్), గామా బెస్ట్ మూవీగా పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని), గామా బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ (పుష్ప 2) అవార్డులు దక్కించుకోవడం విశేషం.

Exit mobile version