Site icon vidhaatha

Hridayapoorvam : ‘హృదయపూర్వం’ మాళివిక మోహనన్

Hridayapoorvam Mohanlal and Malavika Mohanan

Hridayapoorvam | విధాత : అందం..అభినయం కలబోతగా కనిపించే హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan). తమిళం(Tamil), మలయాళం(Malayalam) భాషలలో వరుసగా సినిమాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ‘హృదయపూర్వం’(Hridayapoorvam) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చీరకట్టులో ముస్తాబైన ఫోటోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది. సింపుల్ చీరకట్టులో తళుక్కుమన్న మాళివిక మోహనన్(Malavika Mohanan) అందాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఏడాది తనకెంతో ప్రత్యేకమని…మూడు ఇండస్ట్రీల నుంచి మూడు అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నట్లు పేర్కొంది. తమిళంలో హీరో కార్తితో కలిసి నటించిన ‘సర్దార్2’ షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. తెలుగులో హీరో ప్రభాస్(Prabhas) , డైరెక్టర్ మారుతీ(Director Maruti) కాంబోలో వస్తున్న ‘ది రాజాసాబ్‌’(The Raja Saab) సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ మూవీ ఈ డిసెంబరులో విడుదల కానుంది.

ఇకపోతే గురువారం వినాయక చవితి సంర్భంగా మాళవిక మోహనన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో(Mohanlal) కలిసి నటించిన ‘హృదయపూర్వం’ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. పదేళ్ల గ్యాప్ తర్వాతా ప్రముఖ దర్శకుడు సత్యన్‌ అంతికాడ్‌, మోహన్‌లాల్‌ లు మళ్లీ కలిసి చేసిన ఈ సినిమాకు మాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. 32 ఏళ్ల మాళవిక, 65 ఏళ్ల మోహన్ లాల్ సరసన కథానాయికగా నటించడంపై సోషల్ మీడియాలో రేగిన చర్చ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన హృదయపూర్వం చిత్రం మోహన్ లాల్ పాత్ర అయిన సందీప్ చుట్టూ తిరుగుతుంది. గుండె మార్పిడి నుండి బయటపడిన వ్యక్తి తన దాత కుటుంబాన్ని కలవడానికి పూణే వెళ్తాడు. ఈ ప్రయాణంలో అతను మాళవిక పాత్రతో ఏర్పడిన పరిఛయం..వారి మధ్య సాగిన భావోద్వేగ, నాటకీయ సన్నివేశాలతో సినిమా సాగుతుంది.

Exit mobile version