Naga Chaitanya|నాగ చైతన్య‌కి రెండో పెళ్లి క‌ళ వ‌చ్చేసిందిగా.. పెళ్లి బ‌ట్ట‌ల‌లో తెగ మెరిసిపోతున్నాడు..!

Naga Chaitanya| యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య ఇటీవ‌ల త‌న విడాకులు, రెండో పెళ్లి విష‌యంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య కొన్నాళ్ల‌పాటు ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఏం జ‌రిగిందో ఏమో కాని ఊహించ‌ని విధంగా స‌మంత‌తో విడాకులు తీసుకున్నారు. ఇక కొన్నాళ్ల‌పాటు శోభిత‌తో రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారాలు జరిగిన వాటిపై స్పందించిం

  • By: sn    cinema    Aug 29, 2024 6:37 AM IST
Naga Chaitanya|నాగ చైతన్య‌కి రెండో పెళ్లి క‌ళ వ‌చ్చేసిందిగా.. పెళ్లి బ‌ట్ట‌ల‌లో తెగ మెరిసిపోతున్నాడు..!

Naga Chaitanya| యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య ఇటీవ‌ల త‌న విడాకులు, రెండో పెళ్లి విష‌యంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య కొన్నాళ్ల‌పాటు ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఏం జ‌రిగిందో ఏమో కాని ఊహించ‌ని విధంగా స‌మంత‌తో విడాకులు తీసుకున్నారు. ఇక కొన్నాళ్ల‌పాటు శోభిత‌తో రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారాలు జరిగిన వాటిపై స్పందించింది లేదు. అయితే ఆగ‌స్ట్ 8న శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం జరిగింది. కొంత కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ అఫీషియల్ గా తమ బంధాన్ని అనౌన్స్ చేశారు. నిశ్చితార్థం తర్వాత పెళ్లి ఎప్పుడు అనేది రివీల్ చేయలేదు.

ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అటు శోభిత కాని ఇటు చైతూ కాని ఇద్దరూ పెద్దగా మీడియాకి, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో క‌నిపించింది లేదు. అయితే తాజాగా స్మాల్ ఇంటరాక్షన్ లో చాలానే విషయాలను నాగ చైతన్య పంచుకున్నాడు. వాటిలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అన్నింటికంటే శోభితాతో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు అనే విషయంపై నాగ చైతన్య రియాక్ట్ అయ్యాడు. ఒక స్టోర్ ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న నాగ చైత‌న్య బ‌రాత్ పెట్టి పెళ్లి ఊరేగింపులా తీసుకెళ్లిన విధానం అందరికీ న‌చ్చేస్తుంద‌ని అన్నాడు. పెళ్లికి కూడా ఇలాంటి డ్రెస్ లోనే, ఇలాంటి కలర్ లోనే కనిపిస్తారా? అంటే ఇంకా అంతదూరం ఆలోచించలేదు అని చెప్పాడు.. అయితే అదే తన ఫేవరెట్ కలర్ అని మాత్రం క్లారిటీ ఇచ్చాడు.

వైట్, క్రీమ్ వంటి సెటిల్ కలర్స్ అంటే ఇష్టమని చెప్పాడు. ఇంక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా నాగ చైతన్య రియాక్ట్ అయ్యాడు. ఏమైనా బాలీవుడ్ సినిమాలు ఓకే చేశారా అని అడగ్గా.. స్క్రిప్ట్స్ అయితే ఎక్కడి నుంచైనా వింటాను. ఎవరు వచ్చినా కథలు వింటాను అంటూ చై తెలియ‌జేశాడు.ఇంక నాగ చైతన్య- శోభితా ధూలిపాళ్ల వివాహం ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా.. నాగ చైతన్య అతి త్వరలోనే మీకు తెలియజేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. భారీ స్థాయిలో గ్రాండ్ గా చేసుకోవాలని కాదు కానీ.. సాంప్రదాయం ప్రకారం అందరి సమక్షంలో పెళ్లి జరగాలి. అదే నాకు ఇష్టం అంటూ చైతూ తెలియ‌జేశారు. ఇక ఇటీవల వివాదంగా మారిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగ చైతన్య స్పందించలేదు. దాని గురించి ఇప్పుడు ఎందుకు అని దాటవేశారు.