రాజ‌మౌళి ఫ్యామిలీ వంద‌ల ఎక‌రాలు పోగొట్టుకున్నారా.. సింగిల్ బెడ్ రూమ్‌లో 12 మంది ఎలా ఉన్నారు..!

రాజ‌మౌళి ఫ్యామిలీ వంద‌ల ఎక‌రాలు పోగొట్టుకున్నారా.. సింగిల్ బెడ్ రూమ్‌లో 12 మంది ఎలా ఉన్నారు..!

ద‌ర్శ‌క ధీరుడిగా, ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు రాజ‌మౌళి. ఆయ‌న ఖ్యాతి ఎల్ల‌లు దాటించి బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ వంటి అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన రాజమౌళి త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.అయితే ఒక్కోసారి రాజ‌మౌళి పర్స‌న‌ల్ విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, అవి తెలుసుకొని అంద‌రు షాక్ అవుతుంటారు. రాజమౌళి కుటుంబం చాలా పెద్ద‌ది అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, అన్న శివ శక్తి దత్తా కలిసే ఉంటారు. రాజమౌళి చిన్నప్పుడు వారి ఫ్యామిలీ అంతా కర్నాటకలో ఉన్నారు. ఇక రాజ‌మౌళి రాయ‌చూర్‌లో జ‌న్మించ‌గా, ఆ స‌మ‌యంలో వారికి వంద‌ల ఎక‌రాలు ఉండేద‌ట‌.

రాజ‌మౌళి ఫ్యామిలీకి 360 ఎక‌రాలు ఉండేద‌ని తాను తాను 10, 11ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భూమి మొత్తం పోయిందట‌. అప్పట్లో శివశక్తి దత్త ఓ సినిమా చేయ‌గా, అది దారుణ‌మైన ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఇక రైల్వే ట్రాక్ కోసం కొంత భూమిని కోల్పోయార‌ట‌. ప‌లు కార‌ణాల చేత ఉన్న‌దంత అమ్ముకుంద‌ట రాజ‌మౌళి ఫ్యామిలి. ఆ త‌ర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. సినిమా ఆఫ‌ర్స్ లేవు. రోడ్డున ప‌డే ప‌రిస్థితి ఉండ‌డంతో రాజ‌మౌళి ఫ్యామిలీ చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సింగిల్ బెడ్ రూమ్ తీసుకున్నార‌ట‌. అందులో మొత్తం 12 మంది ఉన్నార‌ట‌. చాలా ఇరుకుగా, ఇబ్బందిగా ఉన్నా కూడా వారు అందులోనే ఉంటూ కాలం వెళ్ల‌దీసార‌ట‌.

రెంట్‌ కట్టడానికి కూడా ఇబ్బంది పడే స‌మ‌యంలో వాళ్ల పెద్ద ఒక్కడే ఫ్యామిలీ బాధ్యతని భుజాలపై వేసుకుని ఆయన కష్టపడి తమని పోషించినట్టు తెలిపారు రాజమౌళి. ఇక రాజ‌మౌళి వ‌య‌స్సు 22 ఏళ్లు రాగా, ఆయ‌న తండ్రి ఏం చేస్తావ‌ని అడిగేవాడ‌ట‌. అప్ప‌ట్లో ఒక ఆంటీ త‌న‌ని తిట్ట‌గా రాజ‌మౌళి వ‌దిన ఇత‌డు ఎవ‌రికి చెడ్డ పేరు తీసుకురాడు అని అన్నాడ‌ట‌. దాంతో త‌న లైఫ్‌ని రాజ‌మౌళి చాలా సీరియ‌స్‌గా తీసుకొని సీరియ్‌గా ప‌ని చేయ‌డం ప్రారంభించాడ‌ట‌. మొద‌ట కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రాజమౌళి.. స్టూడెంట్‌ నెం 1 చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా హిట్ కావ‌డంతో రెండో సినిమాగా సింహాద్రి చేశాడు . ఈ మూవీ చరిత్ర సృష్టించింది. అనంత‌రం . సై, ఛత్రపతి, విక్రమార్కుడు`తో రికార్డులు తిరగరాశాడు. `మగధీర`తో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాడు. `ఈగ, మర్యాద రామన్న, బాహుబలి, `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా ఎదిగాడు