Rajinikanth| సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ వరకు ఆయన ఎదిగిన తీరు అందరికి ఆదర్శనీయం. ఇప్పటికీ ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటూ సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల ఆస్తులు ఉన్నా కూడా రజనీకాంత్ చాలా సింపుల్‌గా ఉంటారు. ఎక్కడ కూడా అహంకారం ప్రదర్శించరు. అప్పుడప్పుడు ఆధ్యాత్మిక యాత్రకు వెళుతుంటారు. ప్రతిసారి తన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతానని చెబుతుంటారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక భావం తప్పక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.రజనీకాంత్ స్టైల్ , స్పీచ్ , చేసే ప్రతి పని చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
రజనీకాంత్ పలు సందర్భాలలో ముద్ర వేసి కనిపిస్తుంటారు. రీల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో రజనీకాంత్ పై ఫోటోలో చూపించిన విధంగా ముద్ర వేస్తూ కనిపిస్తారు. అయితే రజినీ వేసిన ఆ ముద్రకు అర్థమేంటి?రజినీ ఆ ముద్రను వేయడానికి కారణం ఉంది. యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రజినీ అనుసరించే ఈ చేతి ముద్రను చిన్ ముద్ర అంటారు. ఈ ముద్రను అనుసరించడం వల్ల మెదడు నరాలు మెరుగ్గా పనిచేయడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఒత్తిడి తగ్గడం వలన మానసకి ప్రశాంతత కలుగుతుంది. ఈ ముద్రను ప్రతిసారి అనుసరించడం వల్ల నరాలను ప్రశాంతపరుస్తుంది. అలాగే మన దృష్టి మరల్చకుండా ఉంటుంది.
సాధారణంగా ఈ ముద్రని యోగ చేస్తున్న సమయంలో అనుసరిస్తుంటారు. కాని రజనీకాంత్ మాత్రం తాను రెగ్యులర్‌గా ఉపయోగిస్తూ ఉంటారు. దానికి అంత పవర్ ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం కూలీ , వెట్టయాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. తలైవా 170గా వస్తోన్న వెట్టయాన్ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జైలర్ సినిమాతో రజనీకాంత్ బంపర్ హిట్ కొట్టడంతో ఆయన నటిస్తున్న ప్రతి సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.