Site icon vidhaatha

Salman Khan|స‌ల్మాన్ ఖాన్ చావు అంత‌క‌న్నా దారుణంగా ఉండ‌బోతుంది.. బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

Salman Khan| బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వైవిధ్య‌మైన సినిమాల‌తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న స‌ల్మాన్ ఖాన్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న స‌ల్లూభాయ్ ఇటీవ‌ల డెత్ థ్రెట్స్ ఎదుర్కొంటున్నిడు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ కు ప్రాణగండం వెంటాడుతుంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ కి ముంబై పోలీసులు భద్రత పెంచారు. అలాగే తాము చెప్పినట్లు చేయకపోతే సల్మాన్ కి చావే అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కృష్ణ జింక (Black buck) ని వేటాడిన కేసులో కోర్ట్ సల్మాన్ ఖాన్‌కి ఉపశమనం ఇచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం అత‌నికి చుక్క‌లు చూపిస్తూనే ఉంది. అయితే రీసెంట్‌గా ముంబై ట్రాఫిక్ పోలీసులకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. రూ. 5 కోట్లు ఇస్తే సల్మాన్‌ని క్షమించి వదిలేస్తామని, ఒకవేళ చెల్లించకపోతే సిద్ధిఖీ కంటే దారుణమైన చావుని చూస్తాడని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ సినిమాల‌తో పాటు బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ‘బిగ్ బాస్ 18’ (Bigg Boss 18) షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది.

గురువారం అర్ధరాత్రి సెట్ లోకి అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్ తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హౌస్ లో బస చేశారని, అంతేకాకుండా ‘వీకెండ్ కా వార్’ అనే ఎపిసోడ్ ను అక్కడ షూట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. సెట్ లో సల్మాన్ ఖాన్ చుట్టూ దాదాపు 60 మంది సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, నిరంతరం వాళ్లు సల్మాన్ ఖాన్ తో పాటు సెట్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సెట్ లోకి బయట వారికి ఎవరికీ అనుమతి లేదట. సిబ్బంది సైతం ఆధార్ కార్డు చూపిస్తేనే అక్కడ అడుగు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. సెట్‌లో ఉండే కొద్ది మంది కూడా ఫోన్స్‌కి అందుబాటులో ఉండ‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. గతంలో సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పైనా కాల్పులు జరిపిన ఉందంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి.

Exit mobile version