న్యాయం చేయాల‌ని రాస్తారోకో.. ఆందోళ‌న‌ విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా తిమ్మాపురం గ్రామం బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు జూపల్లి నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. బస్వాపురం భూ నిర్వాసితులు 57 రోజులుగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, కొత్త అవార్డు ప్రకటించి ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న వరుస ఆందోళనల్లో నరసింహ పాల్గొంటూ వస్తున్నాడు. ఒకవైపు నిర్వాసితులు వరుస ఆందోళన చేస్తుంటే అధికారులు తాజాగా ఇండ్లకు నోటీసులు […]

  • న్యాయం చేయాల‌ని రాస్తారోకో.. ఆందోళ‌న‌

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా తిమ్మాపురం గ్రామం బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు జూపల్లి నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. బస్వాపురం భూ నిర్వాసితులు 57 రోజులుగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, కొత్త అవార్డు ప్రకటించి ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న వరుస ఆందోళనల్లో నరసింహ పాల్గొంటూ వస్తున్నాడు.

ఒకవైపు నిర్వాసితులు వరుస ఆందోళన చేస్తుంటే అధికారులు తాజాగా ఇండ్లకు నోటీసులు అంటించడంతో నరసింహ ఆవేదన గురై గుండెపోటుతో మరణించాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ భువనగిరి సమీపంలో మానుకుంట వద్ద రహదారిపై తిమ్మాపురం వాసులు రాస్తారోకోతో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోక‌వడం పట్ల నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.

Updated On 25 Jan 2023 1:07 PM GMT
krs

krs

Next Story