Wednesday, March 29, 2023
More
    HomelatestDR PREETHI ISSUE| KMC: అనిస్థిషియా HOD డా. నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు

    DR PREETHI ISSUE| KMC: అనిస్థిషియా HOD డా. నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు

    • భూపాలపల్లి మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్
    • చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

    విధాత’ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డాక్టర్ ప్రీతి మృతి కేసులో కేఎంసీ పాలనా యంత్రంపై చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రీతిని సీనియర్ పీజీ మెడికో డాక్టర్ సైఫ్ వేధించిన ఫిర్యాదు నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ పక్షాన తీసుకోవాల్సిన చర్యల పట్ల అలసత్వం ప్రదర్శించారని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. మెడికో ప్రీతి ఆత్మహత్య ఉదంతంలో నాగార్జునరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. కేఎంసి అనిస్తీషియా హెచ్ఓడి నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు పడింది.

    ప్రీతి ఆత్మహత్య సంఘటనలో కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వరంగల్ కేఎంసీలో అనస్తీషియా హెచ్ వోడీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ కె నాగార్జునరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  నాగార్జునరెడ్డిని భూపాలపల్లి ప్రభుత్వ వైద్యకళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    డీఎంఈ గురువారం ఇచ్చిన లేఖపై స్పందించిన వైద్యా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ ఏ ఎం రిజ్వి ఈ మేరకు నాగార్జున రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన చర్యలలో భాగంగా ఈ బదిలీ చేపట్టినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. కాగా, బదిలీతో KMCలో కలకలం నెలకొంది. నాగార్జున రెడ్డి బదిలీతో సరి పెట్టుకుంటారా? లేక ఇంకెవరిపైనన్నా వేటు వేస్తారా అనే చర్చ సాగుతోంది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular