HomelatestCPI Narayana | మోడీ అవినీతి కుంభకోణం బయటపడుతోంది: నారాయణ

CPI Narayana | మోడీ అవినీతి కుంభకోణం బయటపడుతోంది: నారాయణ

CPI Narayana

విధాత‌: పెద్ద నోట్ల రద్దుపై గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని అందరూ తప్పపట్టారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికడతామని, అవినీతిపరుల భరతం పడతామని చెప్పిన విషయం ఆచరణలో కార్యరూపం దాల్చకపోగా ఆ లక్ష్యం నెరవేరలేదు. దీంతో తాజాగా రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ చేసిన ఆకస్మిక ప్రకటనను రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.

దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పందిస్తూ.. రూ. 2 వేల నోట్లను నిషేధించకుండా దాన్ని మార్చుకోవడానికి అవకాశం కల్పించడంలోనే మోడీ అవినీతి కుంభకోణం బయటపడుతున్నదని ఆయన మండిపడ్డారు. గతంలో నోట్ల రద్దు ప్రకటించినప్పుడు సామాన్యలు ఇబ్బందులు పడ్డ విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కార్పొరేట్‌ కంపెనీలు, ధనవంతులు వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి వీలుగా ప్రధాని నోట్ల రద్దు చేశారని ఆయన ఆరోపించారు. అనంతరం చెలామణీలోకి రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చారని, వాటిని నిషేధించకుండా మార్చుకునే అవకాశం ఇవ్వడం ధనవంతులకు మేలు చేయడమే అని నారాయణ విమర్శించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular