Home Latest news సికింద్రాబాద్ అల్లర్లు: 10 మంది వాట్సాప్‌ గ్రూప్ అడ్మిన్లు అరెస్ట్

సికింద్రాబాద్ అల్లర్లు: 10 మంది వాట్సాప్‌ గ్రూప్ అడ్మిన్లు అరెస్ట్

విధాత‌, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో వాట్సాప్ గ్రూపులు కీలకంగా వ్యవహరించాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విధ్వంసంలో కీలక పాత్ర పోషించిన ఎనిమిది వాట్సాప్ గ్రూపుల ఆడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్ల వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధులు ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ విధ్వంసం వెనుక వాట్సాప్ గ్రూపులు కీలక పాత్ర పోషించాయని రైల్వే సిట్ బృందం గుర్తించింది. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్స్, చలో సికింద్రాబాద్ ఏఆర్ఓ3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాలీ,సీఈఈ సోల్జర్స్ పేరుతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు.

ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున రెచ్చగొట్టేలా వ్యవహరించారని సిట్ బృందం గుర్తించింది. ఈ వాట్సాప్ గ్రూపుల ఆడ్మిన్లను Police అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఎనిమిది మంది వాట్సాప్ గ్రూపుల ఆడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావును తెలంగాణకు చెందిన టాస్క్ పోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నుండి నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చిన తర్వాత ఆవుల సుబ్బారావును టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులకు అప్పగించారు.

ఆవుల సుబ్బారావు ను రైల్వే సిట్ బృందం ఇవాళ విచారించనుంది. మరో వైపు సికింద్రాబాద్ రైల్వే స్టేసన్ లో విధ్వంసానికి వాట్సాప్ లు కీలకంగా పనిచేశాయని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే సుమారు 10 వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులను రెచ్చగొట్టారని ఇప్పటికే సిట్ బృందం గుర్తించింది.

ఇదిలా ఉంటే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్మీ అభ్యర్ధులను రెచ్చగొట్టేందుకు గాను ఓ ప్రైవేట్ డిఫెన్స్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారని సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసంలో పాల్గొన్న వారిలో 56 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా 11 మంది పరారీలో ఉన్నారని రైల్వే ఎస్పీ అనురాధ ఇప్పటికే ప్రకటించారు.

మరో వైపు మంగళవారం మరో 15 మంది అనుమానితులను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై జరిపిన కాల్పుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ అనే యువకుడు మరణించాడు. మరో వైపు ఆందోళనలో పాల్గొన్న వారిలో 11 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని కూడా రైల్వే పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...