VarunTej | జూన్‌ 9న వ‌రూణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్‌..? విధాత: మెగా ఫ్యామిలీలో అల్లుడు అవుట్.. కోడ‌లు ఇన్‌  అని టాలివుడ్ కోడైకూస్తుంది. మెగా ఫ్యామిలీ డాట‌ర్ నిహారిక కొనిదెల త‌న భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో త్వ‌ర‌లోనే విడాకులు తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి విధిత‌మే. అయితే మెగా కుటుంబంలో ఒక‌ జంట విడాకులు తీసుకుంటుండ‌గా, అదే ఫ్యామిలీకి చెందిన మ‌రో ప్రేమ‌జంట త్వర‌లోనే ఒక‌ట‌వుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ ల‌వ‌ర్స్ […]

VarunTej |

జూన్‌ 9న వ‌రూణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్‌..?

విధాత: మెగా ఫ్యామిలీలో అల్లుడు అవుట్.. కోడ‌లు ఇన్‌ అని టాలివుడ్ కోడైకూస్తుంది. మెగా ఫ్యామిలీ డాట‌ర్ నిహారిక కొనిదెల త‌న భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో త్వ‌ర‌లోనే విడాకులు తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి విధిత‌మే.

అయితే మెగా కుటుంబంలో ఒక‌ జంట విడాకులు తీసుకుంటుండ‌గా, అదే ఫ్యామిలీకి చెందిన మ‌రో ప్రేమ‌జంట త్వర‌లోనే ఒక‌ట‌వుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది.

టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ ల‌వ‌ర్స్ గా పిలుచుకునే వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో ఈ నెల 9వ తేదీన ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. గతంలో వీరిద్దరు కలిసి శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్‌, సంకల్ప్‌ రెడ్డి దర్వకత్వంలో వచ్చిన అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌పై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు.

మరో వైపు మెగా డాటర్స్‌కు పెళ్లిళ్లు అచ్చి రావడం లేదు. ఇప్ప‌టికే మెగా కుటుంబంలో చిరంజీవి పెద్ద కూతురు వివాహం సమయంలో రచ్చ జరుగగా, చిన్న కూతురు మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకుని రెండ‌వ భ‌ర్త‌తోను ప్ర‌స్తుతం దూరంగా ఉంటుంది.

ఈ క్రమంలో రెండేండ్ల క్రితం విహాహం చేసుకున్న నాగ‌బాబు కూతురు నిహారిక కూడా గ‌త కొద్ది రోజులుగా భ‌ర్త చైత‌న్య‌తో దూరంగా ఉంటుందని, త్వ‌ర‌లోనే విడాకులు తీసుకుంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆ వార్తలు వాస్తవమే అన్నట్లుగా నిహరికా సైతం వెబ్ సీరిస్‌లు నిర్మిస్తూ, నటిస్తూ బిజీగా ఉంటుంది. అంతేగాక హట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నది.

ఇక అదే ఫ్యామిలీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే ఇద్ద‌రికి విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్న సంగ‌తి విధిత‌మే. అయితే తాజాగా మెగా ఫ్యామిలీలో ఓ జంట విడాకులు, మ‌రో జంట పెళ్లి పీఠ‌లు ఎక్క‌నుండ‌టంతో మెగా అభిమానుల‌కు కొంత నిరాశ‌, కొంత ఆనందం మిగిలింది.

Updated On 1 Jun 2023 3:39 PM GMT
krs

krs

Next Story