Oscar-2023 | ఎప్పుడెప్పుడా అని సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, దర్శకులు చేరుకున్నారు. ప్రముఖ కమెడియర్ జమ్మీ కిమ్మెల్ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ బరిలో ఉండడంతో భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వేడుకల్లో సందడి చేశారు. నాటు నాటు సాంగ్‌తో పాటు మరో రెండు భారతీయ డాక్యుమెంటరీలు సైతం ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రజెంటర్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషా గుప్తాతో పాటు పలువురు తారలు ఆస్కార్ వేడుకల్లో సందడి చేశారు. ఈశా గుప్తా ప్రియాంక చోప్రా, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరో వైపు రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. ఇద్దరు కలర్ ఫుల్ దుస్తుల్లో కనువిందు చేశారు.
అలాగే ఇద్దరు హీరోలతో దర్శకుడు రాజమౌళి దిగిన ఫొటోలు ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి దంపతులు, రచయిత చంద్రబోస్ వేదిక వద్ద సందడిచేశారు. అలాగే సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, సైతం వేదిక వద్దకు చేరుకున్నారు. ఇద్దరు వేదికపై లైవ్‌లో పాట పాటనుండగా.. ఇదే పాటకు హాలీవుడ్ నటి లారెన్ గోట్లిబ్ నాటు నాటు పాటకు లైవ్ ఫెర్ఫామెన్స్ ఇవ్వనుంది. ఇక ఆస్కార్ వేడుకలు నాటునాటు సాంగ్‌తో మొదలయ్యాయి. ఈ పాటకు యాంకర్స్ డాన్స్ చేశారు. ఈ పాట తర్వాతే అవార్డ్‌ను వేదికపైకి తీసుకువచ్చారు.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా క్వాన్..
ఆస్కార్ అవార్డుల ప్రదానం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో కేటగిరితో మొదలైంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా క హుయ్ క్వాన్ అవార్డ్‌ను అందుకున్నాడు. ‘ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఆట్ ఒన్స్’ క్వాన్ నటించారు. అలాగే బెస్ట్ సహాయ నటిగా ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ గెలుచుకుంది. వేదికపై అవార్డ్ అందుకున్న జామీ లీ.. చిత్రయూనిట్ తోపాటు.. తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది. బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ‘నవల్నీ’ అవార్డును దక్కించుకున్నది. ఈ అవార్డ్ కోసం ఆల్ దట్ బ్రీత్స్, ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్, నవల్నీ పోటీ పడ్డాయి.
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆన్ ఐరిష్ గుడ్ బై చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఇవాలు, లే పపిల్లే, నైట్ రైడ్, ది రెడ్ సూట్ కేస్ చిత్రాలు బరిలో నిలిచాయి. ఉత్తమ సినిమాటోగ్రఫీ ఆస్కార్ అవార్డ్ జేమ్స్ ఫ్రెండ్ అందుకున్నారు. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ చిత్రానికి ఈ అవార్డ్ అందుకున్నారు జేమ్స్ ఫ్రెండ్.
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘గులెర్మో డెల్ టోరోస్ పినోచియో’.. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా గులెర్మో డెల్ టోరోస్ పినోచియో చిత్రం అవార్డ్ అందుకున్నది. మేకప్ అండ్ హెయిర్‌స్టైల్ – ది వేల్ విభాగంలో ది వేల్‌కి మేకప్, హెయిర్‌స్టైల్‌కి అడ్రిన్ మొరోట్, జుడీ చిన్, అన్నీమేరీ బ్రాడ్లీ అవార్డు అందుకున్నారు. బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో బ్లాక్ పాంధర్ అవార్డును దక్కించుకున్నది.